లోన్లపై వడ్డీ రేట్లను పెంచిన HDFC బ్యాంక్

54చూసినవారు
లోన్లపై వడ్డీ రేట్లను పెంచిన HDFC బ్యాంక్
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన HDFC తన కస్టమర్లకు షాక్ ఇస్తూ లోన్లపై వడ్డీ రేట్లను పెంచింది. బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)ను ఎంపిక చేసిన టెన్యూర్లపై గరిష్ఠంగా 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. ఈ కొత్త వడ్డీ రేట్లు ఈ నెల 7వ తేదీ నుండే అమల్లోకి వచ్చాయని బ్యాంక్ స్పష్టం చేసింది. దీనివల్ల 7.75-8.55%గా ఉన్న వడ్డీ రేట్లు ఇకపై 7.85-8.70%కు చేరుకోనున్నాయి. దీంతో MCLR ఆధారిత రుణాలు తీసుకున్న వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడనుంది.

సంబంధిత పోస్ట్