ఒక్క హాగ్‌‌తో 5 పక్కటెముకలు విరగ్గొట్టాడు!

135చూసినవారు
చైనాలో ఒక వింత ఘటన వెలుగులోకి వచ్చింది. తన భార్యపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ భర్త ఆమెను గట్టిగా కౌగిలించుకోవడంతో, ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఆమెకు ఐదు పక్కటెముకలు విరగడంతో పాటు మరొకటి ఫ్రాక్చర్ అయ్యింది. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించగా, చెస్ట్ సిటీ స్కాన్ ద్వారా ఈ విషయం బయటపడింది. ఇలా జరుగుతుందని ఊహించలేదని భర్త భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్