TG: హైదరాబాద్లోని మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో గిరి అనే వ్యక్తి వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఈ క్రమంలో బాధితుడు గిరి మాట్లాడుతుండగా.. హెడ్ కానిస్టేబుల్ ఖలీల్ అతని చెంప దెబ్బ కొట్టి, దుర్భాషలాడినట్లు బాధితుడు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హెడ్ కానిస్టేబుల్ తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.