
హైదరాబాద్లో పెరిగిన అమ్ముడుపోని ఇళ్లు: 7 శాతం వృద్ధి
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య పెరుగుతోంది. 2026 మూడో త్రైమాసికంలో ఈ ఇన్వెంటరీ 7 శాతం పెరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. కొత్త ప్రాజెక్టుల రాక వేగంగా ఉండగా.. ఇళ్ల అమ్మకాల్లో కేవలం 3 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. దీంతో ప్రస్తుత ఇళ్ల నిల్వలు అమ్ముడవడానికి పట్టే సమయం 2025లో 5.8 త్రైమాసికాల నుంచి ఈ ఏడాది 6.1 త్రైమాసికాలకు పెరిగింది.




