
సహజీవనానికి అడ్డుగా ఉందని కన్న కూతురినే కొరికి చంపిన తల్లి!
AP: గుంటూరులో మూడేళ్ల చిన్నారి ఇషిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. భర్తతో విడిపోయిన తల్లి నాగలక్ష్మి, తన ప్రియుడు సుభాష్తో కలిసి సహజీవనం చేస్తోంది. తమకు అడ్డుగా ఉందని భావించి, ఇద్దరూ కలిసి చిన్నారి మెడపై కొరికి, నేలకేసి కొట్టి దారుణంగా చంపేశారు. చనిపోయిన చిన్నారి మెట్లపై నుంచి పడిందని నిందితులు మొదట నాటకం ఆడారు. అయితే, చిన్నారిపై ఉన్న తీవ్ర గాయాలను గమనించిన వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.




