
ఏఐతో మానవాళికి ముప్పు.. OpenAI శాస్త్రవేత్త హెచ్చరిక
ఏఐ రంగంలో వేగంగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై OpenAI చీఫ్ సైంటిస్ట్ జాకుబ్ పచోకీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన రాసిన 'An Alien Mind' అనే బ్లాగ్ పోస్ట్ ఏఐ విభాగంలో సంచలనం రేపింది. ఏఐ పురోగతి, దాని పర్యవసానాలకు ఎవరూ సిద్ధంగా లేరని, తప్పనిసరి భద్రతా ప్రమాణాలు ఉండాలని పచోకీ పిలుపునిచ్చారు. స్వతంత్ర ఏఐ ఏజెంట్లు మనుషులను మోసగించడం, బేరసారాలు చేయడం వంటివి చేయగలవని హెచ్చరించారు.




