బలమైన ఈదురు గాలులతో భారీ వర్షం (వీడియో)

28చూసినవారు
TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 'అర్నబ్ తుఫాన్' బీభత్సం సృష్టించింది. బూర్గంపాడులోని మొరంపల్లి బంజర్‌లో బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు, రేకుల ఇళ్లు నేలమట్టమయ్యాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడి, తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. అధికారులు వెంటనే స్పందించి, సహాయక చర్యలు చేపట్టాలని, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని, బాధితులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్