
మరోసారి పాల ధరలు పెంపు.. నవంబర్ 1 నుంచి కొత్త ధరలు అమలు..
కర్ణాటక ప్రభుత్వం నందిని పాల ధరను లీటరుకు రూ. 8 పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నూతన ధరలు నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ పెంపుతో టోన్డ్ పాల ధర రూ. 46 నుంచి రూ. 54కి పెరగనుంది. పశువుల మేత, రవాణా ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పెరిగిన రూ. 8లో రూ. 7 నేరుగా రైతులకు చెందుతుందని మంత్రి కృష్ణ బైరేగౌడ వెల్లడించారు. సుమారు 10 లక్షల రైతు కుటుంబాల ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.




