రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు

44చూసినవారు
రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు
'మురసు' తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు బుధవారం(NOV 4) కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్