తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వాయుగుండం ప్రభావంతో మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో వాతావరణ శాఖ అధికారులు 8 జిల్లాలకు అతి భారీ వర్షాన్ని, మరో 20 జిల్లాలకు భారీ వర్షాన్ని అంచనా వేశారు. ముఖ్యంగా పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.