తెలంగాణలో మంగళవారం, బుధవారం కూడా వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.