బాలీవుడ్ హీరోయిన్ నుష్రత్ భరూచా ఇండోనేషియాలోని బాలిలో ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆమె వెన్నెముకకు ఫ్రాక్చర్ అవ్వడంతో ప్రస్తుతం అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె బృందం నుష్రత్‌ను ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైకి తరలించి సర్జరీ చేయించనున్నట్లు ప్రకటించింది. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై వివరాలు వెల్లడి కాలేదు. నుష్రత్ తెలుగులో 'తాజ్ మహల్' (2010) చిత్రంతో పాటు, హిందీలో 'ఛత్రపతి' (రీమేక్), 'సోను కే టిటు కి స్వీటీ' వంటి చిత్రాలలో నటించారు.