టీవీకే MLA అరుళ్ విఘ్నేశ్ తనకు అసభ్యకరంగా మెసేజులు పంపి వేధింపులకు పాల్పడ్డారని మహిళా కలెక్టర్ పెట్టిన కేసు విచారణ సందర్భంగా విజయ్ ప్రభుత్వంపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన జరిగి నెలలు గడుస్తున్నా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడింది. ఎవరినైనా కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారా అని ప్రశ్నించింది. ఇప్పటికే నష్టం జరిగిందని, వెంటనే కమిటీ నియమించి దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది.