AP: శ్రీకాకుళంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన అస్సాం యువతి హిమశ్రీ బోరో కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ప్రాథమిక నివేదిక ఆధారంగా యువతిపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని నిర్ధారించామన్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాక పూర్తి స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు. రైల్వే పోలీసుల హెల్ప్లైన్కు ఫోన్ చేసి ఏ బోగీలో ఉందో చెప్పలేదని, శ్రీకాకుళం రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు వెతికినా యువతి ఆచూకీ లభించలేదని వెల్లడించారు.