హిందుస్థాన్ యూనిలివర్ (HUL) తమ సర్ఫ్ ఎక్సెల్, రిన్, వీల్ వంటి ప్రముఖ డిటర్జెంట్ బ్రాండ్ల ధరలను 11 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ఉత్పత్తి వ్యయాల కారణంగా తమ లాభాలను కాపాడుకోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని సంస్థ పేర్కొంది. ఈ పెంపుతో పలు వస్తువుల ధరలు రూ.1 నుంచి రూ.10 వరకు పెరిగాయి. సర్ఫ్ ఎక్సెల్ క్విక్ వాష్ కిలో ధర రూ.235 నుండి రూ.245కు, ఈజీ వాష్ కిలో ధర రూ.167 నుండి రూ.172కు మరియు రిన్ అలా 500 ఎంఎల్ ధర రూ.5 పెరిగి రూ.95కు చేరుకుంది.