హెచ్‌ఐవీ విజృంభణ.. ఫిజీలో నేషనల్‌ ఎమర్జెన్సీ

65చూసినవారు
హెచ్‌ఐవీ విజృంభణ.. ఫిజీలో నేషనల్‌ ఎమర్జెన్సీ
పసిఫిక్‌ దేశం ఫిజీలో హెచ్‌ఐవీ కేసులు భారీగా పెరగడంతో ప్రభుత్వం ‘నేషనల్‌ హెచ్‌ఐవీ ఎమర్జెన్సీ’ ప్రకటించింది. 10 లక్షల్లోపు జనాభా ఉన్న ఈ దేశంలో ప్రస్తుతం ప్రతి 60 మంది వయోజనుల్లో ఒకరు హెచ్‌ఐవీతో జీవిస్తున్నట్లు అంచనా. 2024లో కొత్తగా 2,060 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. గర్భిణులు, నవజాత శిశువుల్లోనూ కేసులు గుర్తిస్తున్నారు. ఒకే సిరంజీని పలువురు ఉపయోగించడం, అసురక్షిత లైంగిక సంబంధాలు వైరస్‌ వ్యాప్తికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్