
నిరుద్యోగులకు APPSC అలర్ట్.. నేటి నుంచే ఓటీపీఆర్ అప్డేట్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అభ్యర్థులందరూ తమ వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR) వివరాలను తప్పనిసరిగా సవరించుకోవాలని స్పష్టం చేసింది. కొత్త స్థానికత (లోకల్ కేడర్) నిబంధనల ప్రకారం, జీఓ 45 ప్రకారం జిల్లా, జోన్ వివరాలను సవరించుకోవాలి. ఈ సవరణల ప్రక్రియ సెప్టెంబర్ 30, 2026 నుంచి psc.ap.gov.in వెబ్సైట్లో ప్రారంభమైంది. రాబోయే నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ ఓటీఆర్ అప్డేట్ తప్పనిసరి.




