హనీ ట్రాప్ కేసు.. నిందితుడు పవన్ అరెస్ట్

18చూసినవారు
హనీ ట్రాప్ కేసు.. నిందితుడు పవన్ అరెస్ట్
TG: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైదాబాద్ పోలీసులు హనీ ట్రాప్ కేసును ఛేదించారు. మహిళల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి, ఓ పోలీస్ అధికారిని ట్రాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన పవన్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి ఫోన్‌ను పరిశీలించగా అందులో వందల మంది బాధితులు ఉన్నట్లు గుర్తించారు. విచారణలో భాగంగా పోలీసులు వేలాది వాట్సాప్ చాటింగ్‌లను వెలుగులోకి తీసుకువచ్చారు. నిందితుడు పలువురిని ఇదే తరహాలో వేధింపులకు గురిచేసి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్