నేపాల్లో పర్యాటకులతో వెళ్తున్న హాట్ ఎయిర్ బెలూన్ బలమైన గాలుల కారణంగా విద్యుత్ తీగల వైపు దూసుకెళ్లింది. అప్రమత్తమైన టర్కీ పైలట్ మెహమెత్ నూరి బెలూన్ను తీగలకు దూరంగా మళ్లించి సమీపంలోని వరి పొలంలో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. గ్రౌండ్ సిబ్బందికి చేరేందుకు వదిలిన తాడు తెగిపోయినా ఆయన ధైర్యం కోల్పోకుండా పర్యాటకులను ప్రశాంతంగా ఉండాలని సూచించారు. గంటకు 11 నాట్ల వేగంతో గాలులు వీచినట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పైలట్ సమయస్ఫూర్తిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.