
కంటెంట్ క్రియేటర్లకు X శుభవార్త.. రూ.2.85లక్షల వరకు!
కంటెంట్ క్రియేటర్లకు X (ట్విట్టర్) శుభవార్త చెప్పింది. వీడియో కిక్‌స్టార్ట్ బోనస్ పేరుతో ప్రత్యేక ఆఫర్ తీసుకొచ్చింది. 30 రోజుల వ్యవధిలో 15 వీడియోలను పోస్ట్ చేస్తూ రూ.2.85 లక్షల వరకు బోనస్ పొందవచ్చు. ఈ వీడియోలు 3 నిమిషాల లోపు ఉండాలి. ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్ ప్రయోగాత్మక దశలో ఉంది. ఎక్స్ నుంచి ఆహ్వానం అందుకున్న వారే ఇందులో చేరగలరు. ఆహ్వానం పొందిన క్రియేటర్లు ఎక్స్‌లోని Creator Studioలో ‘Programmes’ విభాగం ద్వారా నమోదు చేసుకోవాలి. తొలి విడతలో పాల్గొనడానికి 2026 అక్టోబర్ 30లోపు నమోదు పూర్తి చేయాలి.




