గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని రైయా గ్రామంలో పాత కక్షలతో ఇద్దరు దుండగులు బీభత్సం సృష్టించారు. ఒక ఇంటి కిటికీలపై సోడా బాటిళ్లు విసిరి, ఫిర్యాదుదారుడి కారుకు నిప్పంటించారు. మంటలు వ్యాపించి పక్కనే ఉన్న మరో రెండు కార్లు, బైక్ సహా మొత్తం 7 వాహనాలు దగ్ధమయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పొరుగింటి మహిళ, గుర్తుతెలియని వ్యక్తులపై యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.