
ఆ ఆవు నెయ్యిలో నాణ్యత లేదు.. పతంజలికి షాక్
పతంజలి ఫుడ్స్‌కు మధ్యప్రదేశ్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) షాక్ ఇచ్చింది. బుర్హాన్పూర్లో సేకరించిన సంస్థ ఆవు నెయ్యి నమూనా ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని తేలడంతో, సంబంధిత బ్యాచ్‌ను వెంటనే మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై అప్పీల్ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ రీకాల్ ప్రభావం పరిమితంగానే ఉంటుందని తెలిపింది. గత ఏడాది కాలంలో పతంజలి ఫుడ్స్ షేరు సుమారు 41% పడిపోయింది.




