హూతీల దాడి.. ఇద్దరు భారతీయులకు గాయాలు

10చూసినవారు
హూతీల దాడి.. ఇద్దరు భారతీయులకు గాయాలు
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని ఫైనాన్షియల్‌ సెంటర్‌లో ఉన్న ఒక ఎత్తైన భవనంపై యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులతో సహా మొత్తం 11 మంది గాయపడినట్లు సౌదీ అధికారులు వెల్లడించారు. క్షతగాత్రుల్లో ఇద్దరు సౌదీ పౌరులు, ముగ్గురు నేపాలీ జాతీయులు, నలుగురు ఈజిప్షియన్లు ఉన్నట్లు ధ్రువీకరించారు. అయితే, గాయపడిన భారతీయుల వివరాలు, వారి గాయాల తీవ్రత గురించి అధికారులు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్