మూసి ఉన్న బియ్యం డబ్బాలోకి పురుగులు ఎలా వ‌స్తాయంటే?

1788చూసినవారు
మూసి ఉన్న బియ్యం డబ్బాలోకి పురుగులు ఎలా వ‌స్తాయంటే?
బియ్యం డబ్బా గట్టిగా మూసి ఉంచినా పురుగులు రావడానికి 'రైస్ వీవిల్స్' జీవచక్రమే కారణం. పంట పొలం లేదా నిల్వ సమయంలోనే కంటికి కనిపించని గుడ్లు గింజల లోపలికి చేరుతాయి. డబ్బాలోని తేమ, వేడి వాతావరణం అనుకూలించినప్పుడు ఆ గుడ్ల నుంచి లార్వా అభివృద్ధి చెంది పురుగులుగా బయటకు వస్తాయి. పురుగులు పట్టకుండా ఉండటానికి బియ్యాన్ని పొడి ప్రదేశంలో నిల్వ చేయాలని, పాత బియ్యంలో కొత్తది కలపకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్