వాట్సాప్‌లోనే పీఎఫ్ బ్యాలెన్స్.. ఎలా చూసుకోవాలంటే?

10చూసినవారు
వాట్సాప్‌లోనే పీఎఫ్ బ్యాలెన్స్.. ఎలా చూసుకోవాలంటే?
పీఎఫ్‌ ఖాతాదారులకు ఈపీఎఫ్‌వో కొత్త వాట్సాప్‌ సేవను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా పీఎఫ్‌ బ్యాలెన్స్‌, చివరి ఐదు లావాదేవీలు తెలుసుకోవడంతో పాటు డిజిటల్‌ పాస్‌బుక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం +91 8796441800 నంబర్‌ను సేవ్‌ చేసి ‘Hi’ అని మెసేజ్‌ పంపాలి. అనంతరం భాష, కావాల్సిన సేవను ఎంచుకుని ధ్రువీకరణ పూర్తి చేయాలి. ఇందుకు యూఏఎన్‌కు మొబైల్‌ నంబర్‌ అనుసంధానమై ఉండాలి. అధికారిక నంబర్‌నే సంప్రదించాలని, ఓటీపీ, పాస్‌వర్డ్‌ వివరాలు ఇతరులతో పంచుకోవద్దని ఈపీఎఫ్‌వో సూచించింది.

సంబంధిత పోస్ట్