
ఆసియా పారా క్రీడలు.. నిషాద్ రికార్డు (VIDEO)
ఆసియా పారా క్రీడలు 2026లో భారత అథ్లెట్ నిషాద్ కుమార్ సత్తా చాటాడు. పురుషుల హైజంప్ టీ47 విభాగంలో 2.04 మీటర్ల ఎత్తు దూకి స్వర్ణ పతకం సాధించాడు. ఇప్పటికే లాంగ్‌జంప్ టీ47 విభాగంలోనూ పసిడి గెలుచుకున్న నిషాద్.. ఒకే ఆసియా పారా క్రీడల ఎడిషన్‌లో రెండు స్వర్ణాలు సాధించిన మూడో భారత అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు.




