
20 ఏళ్లకే ఎఫ్1 రేసింగ్ ప్రపంచ ఛాంపియన్‌గా ఆంటోనెల్లి
ఫార్ములా వన్ చరిత్రలో మెర్సిడెస్ డ్రైవర్ కిమీ ఆంటోనెల్లి సరికొత్త రికార్డు సృష్టించాడు. 20 ఏళ్ల వయసులోనే ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి, ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు. మెక్సికో సిటీ గ్రాండ్‌ప్రిలో మూడో స్థానంలో నిలవడంతో అతడి టైటిల్ ఖరారైంది. ఇప్పటివరకు ఈ రికార్డు సెబాస్టియన్ వెటెల్ (23 ఏళ్ల 133 రోజులు) పేరిట ఉండేది. 1953 తర్వాత ఎఫ్1 టైటిల్ గెలిచిన తొలి ఇటాలియన్గా కూడా ఆంటోనెల్లి నిలిచాడు.




