
ప్రేమ పేరుతో నమ్మించి.. నగ్న వీడియోలు ఉన్నాయని బెదిరించిన యువకుడు!
TG: హైదరాబాద్లోని బేగంపేటలో ప్రేమ పేరుతో మోసం చేసి వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 23న కోడూరి గోపి అనే యువకుడు, తనను ఓయో గదికి తీసుకెళ్లి శారీరక సంబంధం పెట్టుకున్నాడని, ఆపై ఇంట్లో వారి అనారోగ్యం పేరుతో లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నాడని బాధితురాలు ఆరోపించింది. డబ్బులు తిరిగి అడగగా, తన నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




