
వాయు కాలుష్యం ఎఫెక్ట్.. ఢిల్లీలో అమల్లోకి గ్రాప్ స్టేజ్-1
ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడంతో సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఈ సీజన్లో తొలిసారి GRAP-1 ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. అక్టోబర్ 20న 179గా ఉన్న AQI బుధవారం మధ్యాహ్నం 244కు చేరింది. రాబోయే రోజుల్లోనూ కాలుష్యం అధికంగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఆంక్షల్లో భాగంగా హోటళ్లు, రెస్టారెంట్లలో బొగ్గు, కట్టెల వినియోగంపై నిషేధం విధించారు. డీజిల్ జనరేటర్లను అత్యవసర సమయాల్లో మాత్రమే వినియోగించేందుకు అనుమతించారు.




