
జపాన్‌లో భారత పారా స్విమ్మర్ షేక్ డిపోర్ట్
నగోయాలో గురువారం భారతీయ పారా స్విమ్మర్ మొహమ్మద్ షామ్స్ ఆలమ్ షేక్‌ను జపాన్ పోలీసులు డిపోర్ట్ చేశారు. షెర్టన్ హోటల్లో హౌజ్‌కీపింగ్ సిబ్బందిగా పనిచేస్తున్న నేపాలీ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై బాధితురాలు హోటల్ మేనేజర్‌కు ఫిర్యాదు చేయగా, పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. భారత్ చేరుకోగానే సదరు అథ్లెట్‌పై చర్యలు తీసుకుంటామని పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. ఆయనపై జీవితకాల నిషేధం విధించే యోచనలో ఆర్గనైజింగ్ కమిటీ ఉంది.




