
సొంత స్టార్టప్‌లో తండ్రికి ఉద్యోగమిచ్చిన కొడుకు
కేరళలోని కొచ్చికి చెందిన రౌల్ జాన్ అజు (17 ఏళ్ల ) తన అసాధారణ ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. 12వ తరగతి చదువుతున్న రౌల్.. 'ఏఐ రియల్మ్ టెక్నాలజీస్' అనే స్టార్టప్ స్థాపించి 15 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఆసక్తికరంగా, తన తండ్రికి తన కంపెనీలో నెలకు రూ. 2 లక్షల జీతంతో ఉద్యోగం ఇచ్చాడు. మాస్కోలో జరిగిన ఏఐ జర్నీ సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో రౌల్ జరిపిన సంభాషణ, సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చిన్నప్పటి నుంచి ఏఐపై మక్కువతో 15 టూల్స్ అభివృద్ధి చేసి నేడు ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచాడు.




