
ప్రయాణికులకు అలర్ట్.. డిసెంబర్ 14 నుంచి 8 రైళ్లు రద్దు!
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు కీలక సూచన చేసింది. మనోహరాబాద్ యార్డులో జరుగుతున్న రైల్వే లైన్ పనుల కారణంగా.. డిసెంబర్ 14 నుంచి 22 వరకు 8 రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కాచిగూడ-నిజామాబాద్, సికింద్రాబాద్-సిద్దిపేట, కాచిగూడ-మెదక్ మార్గాల్లోని రైళ్లు ప్రభావితం కానున్నాయి. అలాగే ముంబై-లింగంపల్లి, భగత్ కీ కోఠి-కాచిగూడ వంటి రైళ్లు 60-75 నిమిషాల ఆలస్యంగా నడుస్తాయని, దౌండ్-నిజామాబాద్ వంటి సర్వీసులను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.




