
సెన్సార్ పూర్తి చేసుకున్న వెంకటేష్ 'ఆదర్శ కుటుంబం'
వెంకటేష్, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న 'ఆదర్శ కుటుంబం' సినిమా ఈ నెల 30న థియేటర్లలో విడుదల కానుంది. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. అయితే, కొన్ని అభ్యంతరకర పదాలను, ప్రముఖుల పేర్లను తొలగించాలని, వయొలెన్స్ సీన్స్‌లో తీవ్రత తగ్గించాలని మేకర్స్‌కు సూచించినట్లు తెలిసింది. రెండు గంటల 29 నిమిషాల నిడివి గల ఈ చిత్రంలో నివేదా పేతురాజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.




