
మహారాష్ట్రలో పాఠశాలలకు 13 రోజుల దీపావళి సెలవులు
మహారాష్ట్ర విద్యాశాఖ 2026-27 విద్యా సంవత్సరానికి గానూ రాష్ట్రంలోని పాఠశాలలకు దీపావళి సెలవులను ప్రకటించింది. నవంబర్ 2వ తేదీ నుంచి నవంబర్ 14 వరకు మొత్తం 13 రోజుల పాటు పాఠశాలలు మూతపడనున్నాయి. నవంబర్ 16 నుంచి రెండో సెమిస్టర్ తరగతులు పునఃప్రారంభమవుతాయని అధికారులు స్పష్టం చేశారు. పాఠశాలలు కనీసం 230 పనిదినాలను పూర్తి చేయాలని, సెలవుల షెడ్యూల్లో మార్పులు చేయాలంటే విద్యాశాఖ అనుమతి తప్పనిసరి అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.




