
ఏపీ, తెలంగాణ ప్రజలకు తీవ్ర హెచ్చరిక.. దూసుకొస్తున్న భారీ అల్పపీడనం
తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, తూర్పు తెలంగాణ పరిసరాల్లో వాయుగుండం ప్రభావం కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ వాయుగుండం ఖమ్మంకు నైరుతి దిశలో 10 కి.మీ దూరంలో కేంద్రీకృతమై, గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా పయనిస్తోంది. ఇది నందిగామ, విజయవాడ, పల్నాడు, నల్గొండ, భద్రాచలం ప్రాంతాలకు సమీపంలో ఉంది. రాబోయే 6 గంటల్లో ఇది బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ శాఖ (IMD) పేర్కొంది. ఈ సమయంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.




