
మంగళగిరి కొండ ప్రాంతంలో పునుగు పిల్లి సంచారం (వీడియో)
AP: గుంటూరు జిల్లా మంగళగిరి కొండ పరిసరాల్లో పునుగు పిల్లి కనిపించింది. కొండపైకి వచ్చే భక్తులు, చుట్టుపక్కల నివాసితులు ఈ అరుదైన వన్యప్రాణిని చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించి కొండ పరిసరాలను పరిశీలించాలని, ప్రజలకు అవసరమైన తగిన సూచనలు ఇవ్వాలని కోరుతున్నారు. క్రూర మృగం కాకపోయినప్పటికీ, పునుగు పిల్లికి ఇబ్బంది కలిగించకుండా దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.




