TG: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఎనికేపల్లిలో బుధవారం వరిచేలో భారీ మొసలి కనిపించడంతో రైతులు, కూలీలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హిమచందన, సంగారెడ్డి వైల్డ్‌లైఫ్ రెస్క్యూ బృందంతో కలిసి గంటల తరబడి శ్రమించి మొసలిని బంధించారు. అనంతరం దానిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. మంజీరా పరిసరాల్లో మొసళ్ల సంచారం ఉండే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా కనిపిస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం అందించాలని అధికారులు హెచ్చరించారు.