
మాజీ సీఎం కోసం 9 మందిని హత్య చేయించా: జేడీయూ ఎమ్మెల్యే
బీహార్ జేడీయూ ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ప్రత్యర్థి నీరజ్ కుమార్కు టికెట్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, మాజీ సీఎం నితీశ్ కుమార్ మద్దతుతో తాను తొమ్మిది మందిని హత్య చేయించానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మాట మారుస్తూ లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వ హయాంలోనే ఆ హత్యలు జరిగాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత శక్తి సింగ్ యాదవ్ తీవ్ర విమర్శలు చేయగా, జేడీయూ నేతలు వాటిని కొట్టిపారేశారు.




