హైదరాబాద్‌లో భారీ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్

11చూసినవారు
హైదరాబాద్‌లో భారీ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్
TG: హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌–హయత్‌నగర్‌ మధ్య 7.1 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ సందర్భంగా ఈ ప్రాజెక్టుపై చర్చించారు. నాగ్‌పూర్‌ తరహాలో కింద సాధారణ రహదారి, మధ్యలో మూడు లేన్ల ఫ్లైఓవర్‌, పైభాగంలో మెట్రో రైలు వెళ్లేలా కారిడార్‌ను రూపొందించనున్నారు. ఈ నిర్మాణంతో ఎల్బీనగర్‌–హయత్‌నగర్‌ మార్గంలో ట్రాఫిక్‌ రద్దీ తగ్గే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్