భారీ పేలుడు.. 11 మంది మృతి (వీడియో)

7చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించడంతో 11 మంది మృతి చెందారు. ఈ పేలుడు ఘటనలో 18 మంది గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనలో మృతులంతా ఆ పరిశ్రమ పరిసర ప్రాంతాల్లో నివసించేవారేనని అధికారులు తెలిపారు. పిప్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మనోరి గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్