
అసెంబ్లీ వద్ద పోలీసుల తోపులాటలో గాయపడ్డ BRS ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. నల్ల దుస్తులతో నిరసన తెలిపేందుకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య జరిగిన తోపులాటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి కిందపడిపోగా, ఆయన కాలికి గాయమైంది. హరీశ్ రావు కూడా కిందపడినట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.




