పాకిస్థాన్‌లో భారీ పేలుడు.. 15 మంది మృతి

4చూసినవారు
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలో శుక్రవారం కోహట్‌లోని ఓల్డ్ పోలీస్ లైన్స్‌లో ఉన్న మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ పేలుడు ధాటికి 15 మంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. పేలుడు పదార్థాలతో నింపిన వాహనం గేటును ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనాస్థలంలో గన్‌ఫైర్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలు దర్యాప్తు చేపట్టాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్