SBIకి భారీ ఫైన్‌

32చూసినవారు
SBIకి భారీ ఫైన్‌
హోమ్‌లోన్‌ పూర్తిగా చెల్లించినప్పటికీ ఆస్తి పత్రాలను తిరిగి ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించిన ఎస్‌బీఐకి వినియోగదారుల కమిషన్‌ భారీ జరిమానా విధించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన గుల్వీర్ సింగ్ చౌహాన్ 1997లో తన సేల్‌డీడ్‌ను బ్యాంకులో డిపాజిట్ చేసి రుణం తీసుకున్నారు. 2019లో రుణాన్ని పూర్తిగా చెల్లించినప్పటికీ, ఆస్తి పత్రాలు కనిపించడం లేదంటూ బ్యాంకు వాటిని తిరిగి ఇవ్వలేదు. దీంతో ఆయన వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కమిషన్‌ వెంటనే సేల్‌డీడ్‌ను అందించాలని, రుణం చెల్లించిన తేదీ నుంచి పత్రాలు తిరిగి ఇచ్చే వరకు రోజుకు రూ.5,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్