AP: నెల్లూరులో భారీ స్కామ్ వెలుగుచూసింది. మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లికి చెందిన బిజివేముల సురేంద్రనాథరెడ్డికి చెందిన భూములను తన పేరు, ఫొటోలు, సంతకాలు, వేలిముద్రలను ఫోర్జరీ చేసి అక్రమంగా తనఖా పెట్టారని బాధితుడు ఆరోపిస్తున్నారు. ఈ నకిలీ డాక్యుమెంట్ ఆధారంగా నెల్లూరు ట్రంక్ రోడ్డులోని ఇండియన్ బ్యాంక్లో రూ.147.79 కోట్ల రుణం పొందినట్లు పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అక్టోబర్ 30న పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.