AP: విజయవాడ శివార్లలో డీఆర్‌ఐ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా విదేశీ బంగారం మరియు కరెన్సీ నోట్లు పట్టుబడ్డాయి. ఒక స్కార్పియో వాహనంలో రహస్య అరలను తనిఖీ చేయగా సుమారు రూ. 5.84 కోట్ల విలువైన బంగారం మరియు విదేశీ నగదును అధికారులు గుర్తించారు. బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతా మీదుగా హైదరాబాద్‌కు ఈ సొమ్మును స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, హైదరాబాద్ వైపు వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు క్యారియర్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద ఉన్న 3.147 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.