దక్షిణ కొరియాలోని బుసాన్ నార్త్ పోర్ట్ వాటర్‌ఫ్రంట్ పార్క్‌లో సెప్టెంబర్ 18న సముద్రం నుంచి కొట్టుకొచ్చిన ఒక భారీ సొరచేప కృత్రిమ కాలువలో చిక్కుకుంది. 'బుకాంగ్-ఇ' అనే ఈ ఆడ డస్కీ షార్క్‌ను చూడటానికి లక్షలాది మంది సందర్శకులు తరలివస్తున్నారు. 18 రోజుల్లో 10 లక్షల మందికి పైగా సందర్శించినట్లు అధికారులు తెలిపారు. అంతరించిపోతున్న జాతికి చెందిన ఈ సొరచేపను తిరిగి సముద్రంలోకి మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.