TG: హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్ జేబా బాగ్ డీ-క్లాస్‌లో భారీ చోరీ జరిగింది. మహమ్మద్ వాసిం ఇంట్లోకి నవంబర్ 27న రాత్రి చొరబడిన దొంగలు బీరువాలో ఉన్న 70 తులాల బంగారు ఆభరణాలను అపహరించి పరారయ్యారు. కుటుంబ సభ్యులంతా ఓ కార్యక్రమానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.