మెడ కోసి భార్యను హత్య చేసిన భర్త

24400చూసినవారు
మెడ కోసి భార్యను హత్య చేసిన భర్త
TG: భర్త చేతిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన వరంగల్‌ జిల్లాలో చోటు చేసుకుంది. నర్సంపేటకు చెందిన అనిల్‌కు ఆరేండ్ల క్రితం రజిత(31)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. హనుమకొండలోని కృష్ణకాలనీలో కుటుంబంతో కలిసి అనిల్‌ నివాసం ఉంటూ మేస్త్రీ పనులు చేస్తున్నాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి అనిల్‌ తన భార్య రజిత కాళ్లు, చేతులు కట్టేసి, మెడ కోసి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్