మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో భార్య కోరిక తీర్చేందుకు ఓ భర్త కారు దొంగతనం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వోక్స్వాగన్ షోరూమ్‌లో పని చేస్తున్న గజేంద్ర అలియాస్ రిషి ఆనంద్, ఖరీదైన కారులో తిరగాలన్న భార్య కోరిక కోసం రూ.23 లక్షల వర్టస్ జీటీ కారును దొంగిలించాడు. సెప్టెంబర్ 28న కస్టమర్ పేరుపై ఉన్న కారును అతను తీసుకెళ్లగా, స్టాక్ తనిఖీలో విషయం బయటపడింది. శుక్రవారం రాత్రి జీపీఎస్ ద్వారా ఆషిమా మాల్ వద్ద కారును గుర్తించగా, భార్య కారు నడుపుతుండగా పట్టుబడింది. గజేంద్ర పరారీలో ఉండగా, భార్యను అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.