భార్యను గొంతు కోసి చంపి.. భర్త పరార్

40చూసినవారు
భార్యను గొంతు కోసి చంపి.. భర్త పరార్
TG: హైదరాబాద్‌ పాతబస్తీలోని బాలాపూర్‌ పరిధి బాబానగర్‌లో అజ్మేరా బేగం (32) అనే మహిళ సోమవారం దారుణ హత్యకు గురయ్యారు. భార్యాభర్తల మధ్య జరిగిన వివాదం తీవ్రరూపం దాల్చడంతో భర్త ముస్తఫా (36) పదునైన కత్తితో ఆమె గొంతు కోసినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటన సమయంలో దంపతుల ముగ్గురు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. హత్య అనంతరం ముస్తఫా పరారయ్యాడు. సమాచారం అందుకున్న బాలాపూర్‌ పోలీసులు క్లూస్‌ టీమ్‌తో ఆధారాలు సేకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్